తెలుగు రాష్ట్రాల అభిమానులు, ప్రేక్షకులు… రజనీకాంత్‌ను తమిళ హీరో అని అనుకోవడం మానేసి చాలా రోజుల అయ్యింది. అయితే ఇంకా రజనీకాంత్, అతని నిర్మాతలు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఇంకా తమిళ ప్రేక్షకులే అనుకుంటున్నారా? రజనీ గత సినిమాలు చూస్తే అలానే అనిపిస్తోంది. కారణం సినిమా పేర్లే. ఆయన కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఓ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. #WeWantAnnaattheTeluguTitle… ఇదే గత కొన్ని రోజులుగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్.
‘అన్నాతె’ సినిమాకు తెలుగు పేరు చెప్పండి అని ఆ హ్యాష్‌ట్యాగ్ అర్థం. ‘అన్నాతె’ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగి ఏడాది అయిపోయింది. సినిమా చిత్రీకరణలో రజనీ పోర్షన్ కూడా పూర్తయిపోయింది. అయినా ఇంతవరకు తెలుగు పేరు ప్రకటించలేదు. దీంతో అభిమానులు త్వరగా చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇంకో సమస్య ఏంటి అంటే… రజనీ సినిమా టైటిల్స్ చూస్తే… తమిళ టైటిల్స్ అచ్చు గుద్దినట్లు పెట్టేయడం, లేదంటే ఆ పేరుకు దగ్గరగా ఏ కొమ్మొ, ఒత్తో తీసేయడం చేస్తున్నారు.
తమిళ పేరు అర్థం వేరు, తెలుగు పేరు అర్థం వేరు ఉన్నా… ఆ పేరుకు దగ్గరగా ఉంటే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ‘అన్నా తే’ అని పెట్టేస్తారేమో అనే కామెంట్లూ కనిపిస్తున్నాయి. కాబట్టి రజనీ టీమ్ వీలైనంత త్వరగా పేరు పెట్టేయాలి.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్