రజనీ కాంత్ కు జరిమానా.. కారణం అదే?

  • July 25, 2020 / 12:37 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయన స్టార్ హీరోనే అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. అది రజినీ సినిమాలకు సంబంధించిన వార్త అయినా.. లేదా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్త అయినా సరే.. వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే రజినీ చేసిన ఓ చిన్న పొరపాటుకు సంబంధించిన వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. రజినీ కాంత్ ఇటీవల చెన్నై నగరంలో కారులో ప్రయాణిస్తున్న తరుణంలో.. ఆయన సీటు బెల్టు పెట్టుకోకుండా కారు డ్రైవ్ చేస్తున్నారట. ఇది కాస్త ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. వెంటనే వారు ఫోటోలు తీసి.. రజినీ కాంత్ కు 100 రూపాయలు ఫైన్ విధించారట. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ ఫైన్ కూడా రజినీ ఇంకా చెల్లించలేదని కూడా తెలుస్తుంది. బహుసా ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారా? లేక తన తప్పు లేదని పోలీసులతో డిస్కస్ చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘దర్బార్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన రజినీ.. ప్రస్తుతం శివ డైరెక్షన్లో ‘అన్నాతై’ అనే చిత్రం చేస్తున్నాడు.

1

2

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus