బాలీవుడ్… ఒకప్పుడు దేశంలో ఓ వెలుగు వెలిగిన సినిమా ఇండస్ట్రీ. పట్టిందల్లా బంగారం అనేలా ఏ సినిమా తీసినా హిట్టే. దీని కోసం బాలీవుడ్లో స్పెషల్ హీరోలు ఉండేవారు. ఆలాగే స్పెషల్ దర్శకులు ఉండేవారు. అంటే మిగిలిన వాళ్ల సినిమాలు కాస్త అటు ఇటు అవుతాయేమో కానీ.. వాళ్లవి మాత్రం పక్కా హిట్లు. అలాగే బాలీవుడ్‌కి ప్రత్యేక జోనర్లు కూడా ఉండేవి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఏం తీసినా కలసి రావడం లేదు. గత రెండేళ్లలో సరైన విజయాలు అందుకున్న సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.
ఇప్పుడు ఎందుకు బాలీవుడ్ ధీనగాధ చెబుతున్నాం అనుకుంటున్నారా? ఉంది.. కారణం ఉంది? ఎందుకంటే బాలీవుడ్ గత వైభవాన్ని రివైండ్ చేసి చూపించేలా ఓ ట్రైలర్ వచ్చింది. అది చూశాక బాలీవుడ్ సినిమాలు ఇంత బాగుండేవి.. ఇప్పుడెందుకు అలా అయిపోయింది అనిపించక మానదు. ఆ సినిమా పేరే ‘రాకీ ఔర్ రాణీ కా ప్రేమ్ కహానీ’. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. కరణ్ జోహర్ తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
మామూలుగా టీజర్ అంటే నాలుగైదు మాంటే షాట్లు, చిన్న పాట బిట్, మంచి మాస్ డైలాగ్ లేదంటే పంచ్ ఉంటాయి. బాలీవుడ్ సినిమా అయినా ఇంతే. అయితే ‘రాకీ – రాణీ’లో అలా ఉండదు. ఒక్క టీజర్లో వంద షాట్లకుపైగా ఉన్నాయి. ఈ టీజర్ విడుదలైన వెంటనే భారీ స్థాయిలో వ్యూస్, కామెంట్స్ వచ్చాయి. నాలుగేళ్ల క్రితం ‘గల్లీ బాయ్’ సినిమాలో రణవీర్ సింగ్, ఆలియా భట్ కలసి నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నారు. ఇక దర్శకుడు కరణ్ జోహార్ దాదాపు 7 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టారు.
కరణ్ సినిమాలు అంటే ఫ్యామిలీ డ్రామా గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే. రణ్వీర్, అలియా లవ్ ట్రాక్, కరణ్ మార్క్ కలర్‌ఫుల్ సన్నివేశాలు ఉన్నాయి. టీజర్ లో ఫ్యామిలీ, డ్యాన్స్, డ్రామా, రొమాన్స్, ట్విస్ట్‌లు దండిగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ టీజర్ చూస్తుంటే ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ గుర్తొస్తోంది. అన్నట్లు ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్