ఉత్తరాంధ్ర జానపద గాయిని, తన గాత్రంతో పుష్కరకాలం పాటు అక్కడి జనాలను ఉర్రూతలూగించిన కళాకారిణి ‘గరివిడి లక్ష్మి’. ఆమె జీవిత కథతో ‘గరివిడి లక్ష్మి'(Garividi Lakshmi) అనే సినిమా రూపొందింది. ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఆనందితో పాటు ఈ సినిమాలో రాగ్ మయూర్, వి కె నరేశ్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య వంటి క్రేజీ ఆర్టిస్టులు కూడా నటించారు. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం రిలీజ్ కి ముందు పలు ఏరియాల్లో ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. మొదటి వీకెండ్ ఈ సినిమా పర్వాలేదు అనిపించేలా వసూళ్ళు రాబట్టింది. ఒకసారి గరివిడి లక్ష్మి (Garividi Lakshmi) కలెక్షన్స్ ను గమనిస్తే:
| డే1 | 0.40 Cr |
| డే2 | 0.51 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | రూ.91 cr (షేర్) |
‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు(షేర్) . 2 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.0.91 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.7 కోట్లు. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.59 కోట్ల షేర్ ను రాబట్టాలి. లిమిటెడ్ రిలీజ్ టైంలో కూడా ఈ రేంజ్ వసూళ్ళు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు.