Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో ఈ షాకింగ్ ట్విస్ట్ మీకు తెలుసా?

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకులలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యమవుతున్నా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ మూవీలో గేమ్ ఛేంజ్ చేసే ట్విస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక ట్విస్ట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సునీల్ రోల్ కథను మలుపు తిప్పనుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఏకంగా నాలుగు గెటప్స్ లో కనిపించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

గేమ్ ఛేంజర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ హైలెట్ గా నిలిచేలా ఉండనుందని సమాచారం అందుతోంది. వేర్వేరు అంశాలపై దేశ ప్రజలకు అవగాహన పెంచే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే ఒక్కడు సినిమాను మించిన సినిమా ఇది అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. శంకర్ కు గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్తలు నిజమవుతాయో లేదో క్లారిటీ రావాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ సినిమాలో సునీల్ పాత్ర ఇచ్చే ట్విస్ట్ థ్రిల్ కు గురి చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని భోగట్టా.. చరణ్, శంకర్ ఖాతాలో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కియారా అద్వానీ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news