సంచలన దర్శకుడు రామ్ గోపాల్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తన ట్విట్టర్ లో సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో పోస్ట్ లు పెడుతూ రచ్చ చేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఏపీ రాజకీయాలపై చేస్తోన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో వర్మ తను రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను సరిగ్గా ఎన్నికల సమయంలో విడుదల చేసి టీడీపీపై ప్రతికూల ప్రభావం చూపేలా చేశాడు. ఆ తరువాత ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అంటూ అటు జగన్,
ఇటు చంద్రబాబు ఇద్దరినీ టార్గెట్ చేశారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన వర్మ.. ఇప్పుడు పొలిటికల్ పంచ్ లు విసురుతున్నాడు. తాజాగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడుస్తోన్న టీడీపీపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీకి నారా లోకేష్ కరోనా వైరస్ లాంటి వాడని.. దానికి వ్యాక్సిన్ తారక్ మాత్రమేనని అన్నారు. టీడీపీ వర్గాలు వీలైనంత తొందరగా నారా లోకేష్ అనే డేంజరస్ వైరస్ ని తరిమికొట్టి తారక్ అనే వ్యాక్సిన్ ని తీసుకోవాలని లేదంటే..
ప్రమాదకరమని అన్నారు. చాలా కాలంగా టీడీపీను టార్గెట్ చేస్తూ.. తారక్ చేతిలో పార్టీ పెట్టాలని వర్మ డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. ఒక్క తారక్ మాత్రమే టీడీపీ పార్టీని కాపాడగలరని గతంలో వర్మ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!