Pawan Kalyan: పీక పిసికి చంపేస్తా అంటూ పవన్ వ్యాఖ్యలపై వర్మ ట్వీట్ వైరల్!

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా పవన్ కళ్యాణ్ గురించి వర్మ సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఈయన అధికార నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

వారాహి యాత్రలో భాగంగా (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ వైసిపి నేతల గురించి మాట్లాడుతూ…తాము అధికారంలోకి వస్తే గూండాలను తరిమికొడతామని పీక పిసికి చంపేస్తాం బట్టలూడదీసి రోడ్డున పరిగెత్తిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా వర్మ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ చివరికి రాజకీయ క్యాంపెయిన్ లో ఇక్కడికి చేరాయి తననుకున్న దాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారంలోకి వస్తే పీక పిసికి చంపుతాం, బట్టలూడదీసి పరిగెత్తిస్తాం చర్మం వలిచేస్తామనీ హింసాత్మకమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ హిట్లర్, సద్దాం కింగ్ కిం జోంగ్ ఉన్ తో సహా ఎవరు అని ఉండరు.

మరొక విషయం ఏమిటంటే అధికారంలోకి వస్తే చంపేస్తాం అంటే ఇప్పుడున్న అధికార నేతలను అది చేయమని చెప్పడమా అంటూ ప్రశ్నించారు. ఈ విధమైనటువంటి హింసను ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే మీటింగ్ కు వచ్చిన యువతను భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో పవన్ కి తెలియాలని తెలిపారు. వైలెన్స్ బెదిరింపులు అన్నింటిని లైవ్ మీడియా ముందు పిల్లలందరూ లివింగ్ రూమ్ లో పిల్లలతో పాటు టీవీలో చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు పవన్ అభిమానులు మీరు ఇలాంటి మాటలు చెబుతుంటే పతివ్రత పరమాన్నం వండడం లాంటి మాటలు గుర్తుకు వస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus