సినిమాను తెరకెక్కించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అలాగే సినిమా ప్రీపొడక్షన్ విషయంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొంతమంది బౌండ్ స్క్రిప్ట్‌తో రెడీ అయ్యి.. సీన్ బై సీన్ చేసుకుంటూ పోతారు. మరికొంతమంది సెట్స్‌లోనే డైలాగ్‌లు, సీన్ రాస్తుంటారు. ఇంకొందరు షెడ్యూల్ – షెడ్యూల్ మధ్య గ్యాప్‌లో డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకొంతమంది అయితే సీన్ బై సీన్ స్కెచ్ కానీ, బొమ్మలు కానీ గీయించుకొని ఓ బుక్ రెడీ చేసుకుంటారు. దాని ప్రకారం సినిమా చేస్తారు. అయితే తాజాగా డెమో షూట్ విధానం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.
దీనికి కారణం ప్రముఖ దర్శకుడు ‘కల్కి’ క్రియేటర్ నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డెమో షూట్ వల్ల సినిమాకు కలిగే ఉపయోగం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. మరి ఆ విషయం విన్నాక ఆలోచన వచ్చిందో, లేక ముందుగానే అనుకున్నారో తెలియదు కానీ ఇటీవల దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని ఇప్పుడు ఈ విధానాన్నే ఫాలో అవుతున్నారట. తాను డైరక్టర్‌గా మారి చేస్తున్న సినిమాలోని ముఖ్యమైన సీన్స్‌ని షూట్ చేసి చూసుకొని ఓకే అనుకుంటే అప్పుడు అసలు సినిమా షూటింగ్ ప్రారంభిస్తారట.
ఈ మేరకు షూటింగ్‌ని త్వరలోనే స్టార్ట్ చేయాలని రామ్ అనుకుంటున్నాడట. అందులో అంతా ఓకే అనుకుంటే.. వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. ఈ లోపు కాస్టింగ్ పనులు పూర్తి చేయాలి అని ఫిక్స్ అయ్యాడట రామ్. దర్శకుడిగా తొలి సినిమా కావడం, నిర్మాత కూడా తానే కావడం లాంటి కారణాల వల్ల రామ్ ఈ ఆలోచన చేశాడు అని అంటున్నారు. ఎంత జాగ్రత్తో కదా. రామ్‌కి వర్కవుట్ అయితే ఇతర దర్శకులు కూడా ఇదే విధానం పాటిస్తారేమో.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం హీరోయిన్ వేట కొనసాగుతూనే ఉంది. తొలుత శ్రీనిధి శెట్టిని అనుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోనే కయాదు లోహర్ వస్తోంది అంటున్నారు. త్వరలోనే ఈ విషయం తేలిపోతుంది అంటున్నారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబరులో విడుదల చేయాలని అనుకుంటున్నారట.