హరీష్ శంకర్(Harish Shankar) టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకడు.స్వతహాగా మంచి రైటర్ కూడా. ‘మిరపకాయ్’ ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్స్ అలాగే ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘గద్దలకొండ గణేశ్’ వంటి హిట్లు కూడా ఇతని ఖాతాలో ఉన్నాయి.
అయితే తర్వత చేసిన ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేశాడు. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి పర్వాలేదు అనే రేంజ్లో టాక్ తెచ్చుకుంది.
కానీ బాలయ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు.హరీష్ శంకర్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసినా ఇప్పట్లో అది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం లేదు. మరోవైపు టాలీవుడ్‌లో ఉన్న మిగతా హీరోలందరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. నితిన్, రామ్ వంటి హీరోలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రామ్ ఎలా ఉన్నా నితిన్ అయితే హరీష్ శంకర్ కి ప్రస్తుతం బెస్ట్ ఛాయిస్ అనేది ఇండస్ట్రీ మాట. మరి చూడాలి హరీష్ ఎవరితో సినిమాని సెట్ చేసుకుంటాడో?!