మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కి ఇటీవల కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానులు కూడా తమ అభిమాన హీరోకి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ కి సరైన హిట్టు లేదు. ‘ఆచార్య'(ఎక్స్టెండెడ్ కెమియో) ‘కిసీ క భాయ్ కిసీ క జాన్'(కెమియో) ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ కి ముందు చేసిన ‘వినయ విధేయ రామ’ కూడా డిజాస్టర్ అయ్యింది. సో చరణ్ కచ్చితంగా ఓ హిట్టు కొట్టాలి.
ప్రస్తుతం అతను ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గ్లింప్స్ కానీ, టీజర్ కానీ ఓ రేంజ్ హై ఇచ్చాయి. ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి చరణ్ రెడీ అవుతున్నాడు. సుకుమార్ ప్రస్తుతం ఆ ప్రాజెక్టుపైనే వర్క్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ పెద్ద హిట్ అయ్యింది.
ఆల్రెడీ చరణ్ ని కలిసి ఓ కథ వినిపించాడు సుక్కూ. అది చరణ్ కి నచ్చింది. కానీ తర్వాత దానిపై వర్క్ చేస్తుంటే.. దానికంటే బెటర్ లైన్ దొరికిందట. దాన్ని డెవలప్ చేసుకున్నాడు. అయితే చరణ్ ని కలిసి మార్చిన కథని వినిపించాల్సి ఉంది. అది చరణ్ ఓకే చేస్తాడా? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘రంగస్థలం’ టైమ్లో కూడా ఇదే జరిగింది. మొదట చరణ్ కి సుకుమార్ ఓ కథ చెప్పాడు.
అది చరణ్ కి నచ్చి ఓకే చేశాడు. కానీ తర్వాత సుకుమార్ కి ‘రంగస్థలం’ ఐడియా తట్టింది. దాన్ని డెవలప్ చేసుకుని చరణ్ ని కలిశాడు. చరణ్ కూడా ఓకే చెప్పడం జరిగింది. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. మరి ఈసారి కూడా సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.