హైదరాబాద్ గల్లీ కుర్రాళ్ల నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఇదే నేపధ్యంలో మరో యూత్ఫుల్ ఎంటెర్టైనర్ మూవీ రాబోతోంది. అదే ‘అమీర్ లోగ్’(Ameer Log).! అన్నిరకాల కమర్షియల్ హంగులను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.’అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి’ సంస్థపై మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి వంటి నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అవ్వల్ దావత్’ పాట, టీజర్ వంటివి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకి ‘స్పిరిట్ మీడియా’ సంస్థ నుండి దగ్గుబాటి రానా అండగా నిలబడుతున్న సంగతి తెలిసిందే. ఈ ‘అమీర్ లోగ్’ని కూడా రానా టేకప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాని ‘స్పిరిట్ మీడియా’నే ధియేట్రికల్ గా విడుదల చేయనుంది.
హైదరాబాద్ గల్లీకి చెందిన ముగ్గురు స్నేహితుల మధ్య సాగే కథ ఇది. వారి జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులు ఏంటి? అనేది చూపిస్తూనే చివరగా యువతకి స్పూర్తినిచ్చేలా ఒక చక్కని సందేశం కూడా ఇవ్వబోతున్నట్టు స్పష్టపవుతోంది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి..!