Miheeka Bajaj: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రానా భార్య మిహీకా బజాజ్ గ్లామర్ ఫోటోలు!

2020 లాక్ డౌన్ టైంలో దగ్గుబాటి రానా.. పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఈవెంట్ మేనేజర్ అయిన మిహీక బజాజ్ ను రానా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత రానా గురించి చాలా వార్తలు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. మిహీక … రానాకి తన సిస్టర్ అంటే వెంకటేష్ కూతురు ఆశ్రిత ద్వారా పరిచయం అయ్యింది. ఇద్దరి మధ్య స్నేహం కుదరడం అటు తర్వాత రానా ..

మిహీక కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించడం జరిగింది. రానా పెళ్లి చేసుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. హీరోలు ఎక్కువ శాతం ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు.దగ్గుబాటి వారి వారసుడు అయిన రానా కూడా అదే చేశాడు. ఇక మిహీక సోషల్ మీడియాలో రానా కంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ ఫొటోస్ అలాగే తన భర్తతో దిగిన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసి నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.

మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన మిహీక .. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో స్లిమ్ గా కనిపిస్తుండటం విశేషం. మిహీక నుండి ఇలాంటి గ్లామర్ యాంగిల్ అస్సులు ఊహించలేదు. అందుకే నెటిజన్లు ‘సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందుకు ఆమె ‘నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు’ అంటూ సమాధానం ఇచ్చింది. మరోపక్క ఆమె పోస్ట్ చేసిన ఫొటోల్లో నడుము కుడి వైపు పైన ఓ టాటూ ఉన్నట్టు కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus