నాగశౌర్య హీరోగా రూపొందిన రీసెంట్ మూవీ ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ను అందించిన ‘ఎస్‌ఎల్‌వి సినిమాస్’ సంస్థ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ‘ఛలో’ తర్వాత నాగ శౌర్య.. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ చేసాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేశాయి. అయితే జూలై 7న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ డిజప్పాయింట్ చేసిందంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.12 cr |
సీడెడ్ | 0.35 cr |
ఉత్తరాంధ్ర | 0.43 cr |
ఈస్ట్ | 0.30 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.24 cr |
కృష్ణా | 0.27 cr |
నెల్లూరు | 0.14 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.05 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.28 cr |
ఓవర్సీస్ | 0.33 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.66 cr (షేర్) |
‘రంగబలి’ (Rangabali) చిత్రానికి రూ.4.67 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.3.66 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ రూ.1.34 కోట్ల నష్టాలతో ప్లాప్ గా మిగిలింది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?