Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఆయన కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ వార్తపై అధికారిక ప్రకటన లేకపోయినా, సినీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Ranveer Singh

రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం దర్శకుడు జై మెహతా తెరకెక్కించనున్న కొత్త ప్రాజెక్ట్‌లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమై, ఈ ఏడాది చివరి వరకు కొనసాగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనంతరం కొంతకాలం కొత్త షూటింగ్‌లకు దూరంగా ఉండి, వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలని ఆయన భావిస్తున్నట్లు బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

ఈ విరామానికి ప్రధాన కారణంగా కుటుంబాన్ని పేర్కొంటున్నారు. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఈ జంట రెండవ బిడ్డ డెలివరీ కొరకు , కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఆయన కొంతకాలం సినిమా పనులను తగ్గించాలనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని రణ్‌వీర్ సింగ్ లేదా ఆయన బృందం ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.

ఇక రణ్‌వీర్ నటిస్తున్న కొత్త సినిమా గురించి కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రం థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నట్లు సమాచారం. రణ్‌వీర్ గతంలో చేయని తరహా పాత్రలో కనిపించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న రణ్‌వీర్ సింగ్, ప్రతి సినిమాతో కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో ఆయన విరామం తీసుకుంటున్నారనే వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా రణ్‌వీర్ సింగ్ నిజంగానే సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారా? లేక ఇవి కేవలం ఊహాగానాలేనా? అనే విషయంపై స్పష్టత రావాలంటే ఆయన లేదా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus