సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్'(Rao Bahadur) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చాలా మంది ఆడియన్స్ కి అది ఓ సెలబ్రేటింగ్ మూవీ అనే చెప్పాలి. అందుకే ఇదే కాంబోలో రూపొందుతోన్న ‘రావు బహదూర్’ పై మొదటి నుండి మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
‘ఎ+ఎస్ మూవీస్’ ‘శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్’ ‘మహాయాన్ మోషన్ పిక్చర్స్’ ‘బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్’ సంస్థలపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర,చింతా గోపాలకృష్ణారెడ్డి, ఈశ్వరన్ విజయ రాఘవన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘జి ఎం బి ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై మహేష్ బాబు, నమ్రత సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్స్, సాంగ్స్ వంటి వాటికి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చింది.కానీ ట్రైలర్ ను మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేయడం వల్ల.. అందులోనూ ‘ప్రౌడ్లీ ప్రెజంట్స్’ అంటూ మహేష్ బాబు పలకడం వల్ల ‘రావు బహదూర్’ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సన్నిహితులకి నిర్మాతలు సినిమాని వీక్షించడం జరిగింది. సుకుమార్ వంటి అగ్ర దర్శకులు ఇప్పటికే ‘రావు బహదూర్’ అద్బుతం అంటూ ట్వీట్లు వేయడం జరిగింది. అంతేకాదు సినిమాని వీక్షించిన మరికొంతమంది సినిమాపై తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వల్ వరకు కొత్తగా ఉంటుందట. ఇంటర్వల్ వద్ద ఓ చిన్న ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు.
అయితే సెకండాఫ్ మరింత ఎంగేజింగ్ గా ఉంటుందట. ప్రీ క్లైమాక్స్ నుండి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో ఉంటుందని… లాస్ట్ లో ఒక షాకింగ్ ఎలిమెంట్ ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ఆడియన్స్ కి ‘రావు బహదూర్’ ఆడియన్స్ కి ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుందని అంటున్నారు. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ ‘ది బెస్ట్’ అని అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..!