తెలుగు సినిమా వైపు ప్రపంచం అంతా చూసేలా చేశాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయన టేకింగ్, విజువల్ పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జక్కన్న సినిమాలకు సంబంధించి ఓ కామన్ కంప్లైంట్ ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.
అదే సినిమాని ఎక్కువగా చెక్కుతూ ఉంటారనేది.అవుట్‌పుట్ విషయంలో అస్సలు రాజీపడరు కాబట్టే.. ఆయన సినిమాలు అనుకున్న డేట్‌కు రావడం చాలా కష్టం.’బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌లను మిస్ అయ్యాయి.
షూటింగ్ షెడ్యూల్స్ మధ్య గ్యాప్స్ రావడం, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్లే ఆలస్యంగా అవి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి'(Varanasi) విషయంలో మాత్రం భిన్నంగా ఉంది. కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ జక్కన్న తాను గీసుకున్న టైమ్‌లైన్‌ను ఎగ్జాక్ట్‌గా ఫాలో అవుతున్నారు.
సినిమా షూటింగ్‌లో ఎలాంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూయస్‌గా షెడ్యూల్స్ జరుపుతున్నారు. టీమ్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే అంతా చకచకా జరిగిపోతోంది. ఈ ఏడాది ఆగస్టు కల్లా ‘వారణాసి’ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని జక్కన్న టార్గెట్‌గా పెట్టుకున్నాడు.ఓ పక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే.. మరోపక్క విజువల్స్ పనులు కూడా ప్యారలల్‌గా స్టార్ట్ చేసేశారట. దీంతో 2027 ఏప్రిల్ 7వ తేదీన ‘వారణాసి’ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
ఈ విషయంలో రాజమౌళి అండ్ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే కెరీర్‌లోనే మొదటిసారి షూటింగ్ డెడ్‌లైన్స్‌ను కరెక్ట్‌గా మీట్ అవుతూ.. జక్కన్న ‘వారణాసి’ తో కొత్త రికార్డ్ సెట్ చేసే అవకాశం ఉంది.