The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

నేచురల్ స్టార్ నాని సాధారణంగా తన సినిమాలను చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తుంటారు. కానీ, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది పారడైజ్’ (The Paradise) విషయంలో మాత్రం ఆయన రూటు మార్చక తప్పలేదు.

The Paradise

ఈ ప్రాజెక్ట్ కోసం నాని చాలా టైమ్ కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి లీకైన ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం మూవీ టీమ్ హైదరాబాద్‌లో కొన్ని నైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి.. అందులో ఓ భారీ బిర్యానీ ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తోందట. అయితే, కేవలం ఈ ఒక్క ఫైట్ ఎపిసోడ్ కోసమే ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. భారీ సెట్స్ వేసి, వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

నిజానికి ఈ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ టైమ్ తీసుకుంటోంది. శ్రీకాంత్ ఓదెల టేకింగ్, భారీ సెటప్స్, మధ్యలో వచ్చిన కొన్ని బ్రేక్స్ వల్ల నాని దాదాపు రెండు నెలల పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆరంభంలో ఈ డిలేతో నాని కాస్త అసంతృప్తిగా ఉన్నా.. రీసెంట్‌గా రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ సాంగ్‌కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చూసి అతను రిలాక్స్ అయినట్టు తెలుస్తోంది.

తరతరాలుగా అణచివేతకు గురైన ఓ గిరిజన తెగ.. తమ ప్రాథమిక హక్కుల కోసం చేసే పోరాటమే ‘ది పారడైజ్’ మెయిన్ స్టోరీ అని అంటున్నారు. ఆ తెగకు నాయకుడిగా ‘జడల్’ అనే ధగడ్  పాత్రలో నాని పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని ఈ ఏడాది ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకోస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus