Rashmika Mandanna: పోకిరి మూవీని ఫాలో అవుతున్న పుష్ప..?

  • April 20, 2021 / 02:50 PM IST

ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్నా తొలి సినిమా నుంచి క్యూట్ లుక్స్ తో, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా మూవీ పుష్పతో పాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు. అయితే రష్మిక గుండులో ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రష్మిక ఫోటోను చూసి నెటిజన్లు అవాక్కవుతుండగా ఫ్యాన్స్ షాకవుతున్నారు. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రష్మికకు తమిళ తంబీలు షాక్ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని సెలూన్లలో గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి.

వ్యాపారం కోసం కొంతమంది వ్యాపారులు అందమైన రష్మికను అందవిహీనంగా మార్చడం గమనార్హం. రష్మిక గుండు ఫోటోలను చూసిన మీమర్స్ ఆమె గుండు ఫోటోలకు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు రష్మిక పుష్ప మూవీలో డీ గ్లామరస్ రోల్ లో నటిస్తున్నారు. పుష్ప మూవీలో రష్మిక పాత్రకు సంబంధించి ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రష్మిక పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుందని సినిమాలో పోకిరి క్లైమాక్స్ తరహా ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం.

మరి లెక్కల మాస్టర్ రష్మిక పాత్రను ఏ విధంగా క్రియేట్ చేశారో తెలియాలంటే ఆగష్టు 13 వరకు ఆగాల్సిందే. సరిలేరు నీకెవ్వరు మూవీతో సక్సెస్ సొంతం చేసుకున్న రష్మిక పుష్ప మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ రష్మిక కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus