Vijay, Rashmika: వరుణ్ – లావణ్య బాటలో విజయ్ – రష్మిక..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఈ మధ్యనే ఘనంగా జరిగింది. నాగ బాబు ఇంట్లోనే కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. 6 ఏళ్లుగా వీళ్ళు ప్రేమించుకుంటున్నట్టు కూడా వరుణ్ తేజ్ – లావణ్య చెప్పుకొచ్చారు. కానీ ఈ గతంలో ఈ విషయం పై వరుణ్, లావణ్యలని ప్రశ్నించగా వాళ్ళు ‘ఇది నిజం’ అని అంగీకరించింది లేదు. అయినా వీళ్ళ పెళ్లి గురించి ప్రచారం జరుగుతూనే వచ్చింది.

మెగా ఫ్యామిలీలో ఏ వేడుక జరిగినా.. అందులో లావణ్య త్రిపాఠి కూడా పాల్గొనేది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేసేవి. మొత్తానికి ముందు నుండీ జరిగిన ప్రచారమే నిజమైంది. ఇప్పుడు మరో జంట కూడా వీరి బాటలోనే నడుస్తుందని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. వాళ్ళే విజయ్ దేవరకొండ – రష్మిక. ‘గీత గోవిందం’ సినిమా టైం నుండీ వీళ్ళు ప్రేమించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.

రష్మికకి ఇది వరకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయినప్పటికీ… విజయ్ దేవరకొండ పై ఉన్న ప్రేమ కొద్దీ క్యాన్సిల్ చేసుకున్నట్టు టాక్ నడిచింది. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా టైంలో వీళ్ళ మధ్య ప్రేమ మరింత బలపడినట్టు టాక్ నడుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళు డేటింగ్ లోనే ఉన్నారు అని ఇన్సైడ్ సర్కిల్స్ సమాచారం.

మీడియా ముందు బయటపడకూడదు అనే ఉద్దేశంతో స్టార్ హోటల్స్ లో కలిసుంటున్నట్టు టాక్ నడుస్తుంది. రష్మిక ఈ మధ్యన తరచూ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్లొస్తుందని కూడా టాక్ గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఏడాది వీళ్ళు కూడా పెళ్లిపీటలు ఎక్కే అవకాశాలు బలంగానే ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus