Rashmika: పాపం ఆ హీరోయిన్ కి బ్యాడ్ టైం నడుస్తుందిగా..!

పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు సమంత ఏదో ఊహించుకొని ఏదేదో చేసేద్దాం అని విడాకులు తీసుకుంటే.. అది కాస్త ఉల్టా పల్టాగా మారిపోయింది . విడాకులు తీసుకున్న తర్వాత సమంత లైఫ్ ఎలా అప్ అండ్ డౌన్స్ మధ్య నలిగిపోతుందో మనం చూస్తూనే వచ్చాం. సినిమా ఇండస్ట్రీలో విడాకుల తర్వాత ఆమె హిట్ కొట్టిందే లేదు. రీసెంట్ గా వచ్చిన ఖుషి తప్పిస్తే విడాకుల తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపే .

అయితే మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలా అవస్థలు పడిన సమంత చేతిలోకి పలు సినిమాలు వచ్చిన అవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. అలాంటి ఓ సినిమానే ది గర్ల్ ఫ్రెండ్ . రష్మిక మందన రీసెంట్గా అనౌన్స్ చేసిన ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా సమంతను అనుకున్నారట. ఆమె కూడా ఓకే చేసింది . అయితే ఆరోగ్యం బాగోలేని కారణంగా ఎక్కువ కాలం పోస్ట్ పోన్ చేస్తూ రావడంతో ఆ ప్లేస్ లోకి (Rashmika) రష్మిక మందన్నాను తీసుకొచ్చారు మేకర్స్ . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది .

ఈ సినిమాను డైరెక్టర్ చేసేది రాహుల్ రవీంద్రన్. అయితే రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సమంతకు ఎంత జాన్ జిగిడి దోస్త్ అనేది తెలిసిందే . ఆఖరికి వాళ్ళు కూడా సమంత కోసం టైం కేటాయించలేకపోయారు .. సమంతను కాదు అంటూ వేరొకరికి ఛాన్స్ ఇచ్చారు అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus