Ravi Teja: ధమాకా సినిమా విజయం వారికే అంకితం.. రవితేజ పోస్ట్ వైరల్!

Advertisement

మాస్ మహారాజా రవితేజ 2022వ సంవత్సరంలో మూడు సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. గత ఏడాది ఈయన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు రవితేజను పూర్తిగా నిరాశపరిచాయి. ఇకపోతే గత ఏడాది చివరిన డిసెంబర్ 23వ తేదీ రవితేజ ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా విడుదలైన పది రోజులకే 100 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఇలా సంవత్సరం చివరిలో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రవితేజ ఈ సినిమా విజయం పై స్పందిస్తూ… నా అభిమానులు శ్రేయోభిలాషులు ధమాకా సినిమాని ఎంతో ఆదరించి అభిమానించినందుకు కృతజ్ఞతలు.

ఈ సినిమా అందుకున్న విజయాన్ని ఈ ఏడాది మరణించిన సినీ నటులకు అంకితం ఇస్తున్నానని రవితేజ ఈ లేఖలో రాసుకొచ్చారు.ఇక ఈ ఏడాది తనకు చాలా కష్టంగా నడిచిందని అయినప్పటికీ తమ ప్రేమాభిమానాలతో తనని ముందుకు నడిపించారని తెలియజేశారు. అదేవిధంగా 2023వ సంవత్సరంలో మరింత ప్రేమను నాపై చూపించి నన్ను ముందుకు నడిపించాలని, కొత్త ఏడాదిలో కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో కూడా రవితేజ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీ విడుదల కానుంది.


బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news