Ravi Teja: తన తండ్రి, కొడుకు తో రవితేజ.. ఫోటో వైరల్..!

  • June 20, 2021 / 04:18 PM IST

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో రవితేజ… తన తండ్రి అలాగే కొడుకుతో కలిసి ఉండడం విశేషం.రవితేజ తండ్రి పేరు భూపతి రాజు రాజగోపాల్ రాజు, ఇక రవితేజ కొడుకు పేరు భూపతి రాజు మహదన్. రవితేజ కొడుకు ఆల్రెడీ ‘రాజా ది గ్రేట్’ మూవీలో నటించాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రంలో చిన్నప్పటి రవితేజ పాత్రలో అతను కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు.

ఇక ఈ ఫొటోలో అతని లుక్ కూడా ఆకట్టుకుంటుంది. భవిష్యత్తులో అతను కూడా మంచి హీరో అవుతాడని కొందరు కామెంట్ లు చేస్తున్నారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఫోటో బయటకి వచ్చినట్టు స్పష్టమవుతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి మూవీలో నటిస్తున్న రవితేజ.. అటు తర్వాత శరత్ మండవ డైరెక్షన్లో ఓ సినిమా, అలాగే త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus