నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో చాలా రోజులుగా తెరకెక్కుతున్న సినిమా ‘ప్యారడైజ్’. ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు చాలా స్పెషల్. సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా రోజుల తర్వాత వస్తోంది. ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా అందులోనే చెబుతారు అని అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆ సినిమా వరుస వాయిదాలకు ఇంకో సినిమా కారణమని అర్థమవుతోంది. అదేంటి ఇటు నాని, అటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమా చేయడం లేదు కదా.. ‘ప్యారడైజ్’ లేట్‌కి ఇంకో సినిమా ఎలా కారణమవుతుంది అని అనుకుంటున్నారా?
అవును, ఇద్దరూ వేరే సినిమాలు ఏవీ చేయడం లేదు. కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అనుకోని పరిస్థితుల్లో ఇంకో సినిమా పనులు కూడా భుజానికి ఎత్తుకోవాల్సింది వచ్చింది అని చెప్పొచ్చు. ఈ మాట ఆయన కానీ, ఆయన టీమ్ కానీ చెప్పలేదు కానీ.. వేరే సినిమా ఈవెంట్‌లో వన్ ఆఫ్ ది హీరో దీక్షిత్ శెట్టి చెప్పిన మాటలు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. ‘కేజేక్యూ’ అనే సినిమా ఆగస్టు 7న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనుల్లో పడే ‘ప్యారడైజ్’ సినిమాకు చిన్న గ్యాప్ ఇచ్చారని అంటున్నారు.
‘కేజేక్యూ’ సినిమా దర్శకుడు కేకే గతేడాది ఆఖరులో చనిపోయారు. అప్పటికే సినిమా షూటింగ్ అంతా అయిపోయినా.. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది అంటే కారణం శ్రీకాంత్ ఓదెల అనే అంటున్నారు. ఎందుకంటే ఆయనే దగ్గరుండి సినిమా పనులు అని పూర్తి చేయించి, రిలీజ్‌కి రెడీ చేశారట. ఈ క్రమంలో నిర్మాత సుధాకర్ కూడా ప్రోత్సాహం ఇచ్చారట. ఈ పనులు చేయడం వల్లే ‘ప్యారడైజ్’ ఆలస్యమైంది అని టీమ్ చెప్పడం లేదు కానీ. ఆ సినిమా టైమే ఈ సినిమాకిచ్చారని టాక్.
ఇదంతా ఓకే కానీ.. ‘కేజేక్యూ’ కోసం శ్రీకాంత్ ఎందుకు ముందుకు వచ్చారు అనేదే కదా మీ డౌట్. ఎందుకంటే కేకే, శ్రీకాంత్ స్నేహితులు. అలాగే శ్రీకాంత్ సోదరుడు శశి ఓదెల ‘కేజేక్యూ’లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ కాబట్టి..