Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న విడుదల కానుంది. మొదట్లో ఈ సినిమాపై హైప్ లేదు. కానీ ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కచ్చితంగా థియేటర్ కు వెళ్లి చూడటానికి కొన్ని కారణాల ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

Hari Hara Veera Mallu

1) మొదటి కారణం.. డౌట్ లేకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీ రెంట్రీ తర్వాత ఆయన చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.అలాగే రీ ఎంట్రీ తర్వాత చేసిన మొదటి స్ట్రైట్ మూవీ. అలాగే కెరీర్లో మొదటిసారి ఆయన ఓ గజదొంగగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఓ ఫైట్ సీక్వెన్స్ ను… పవన్ డైరెక్షన్ కూడా చేశారని దర్శకులు జ్యోతి కృష్ణ తెలిపారు.ఆ సీక్వెన్స్ కోసం పవన్ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి సినిమా ఇది. కాబట్టి.. ఆయన గెలుపుని అభిమానులు థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

2) క్రిష్ జాగర్లమూడి జాగర్లమూడి బలమైన కథలు రాసుకుంటారు. పవన్ కళ్యాణ్ కోసం కూడా ఆయన అలాంటి కథనే రాసుకున్నారు. ఈ సినిమాని 80 శాతం క్రిష్ డైరెక్ట్ చేయడం జరిగింది. గతంలో ఆయన బాలకృష్ణతో చేసిన చారిత్రాత్మక సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజువల్స్ కూడా పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ఉంటాయి. ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్లో కూడా విజువల్స్ హైలెట్ అయ్యాయి. ఈ సినిమాతో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది.

3) పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ‘బంగారం’ కూడా మంచి ఓపెనింగ్స్ తీసుకుంది. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు రత్నం. పవన్ కళ్యాణ్ మార్కెట్ ను మించి ఆయన ఖర్చు పెట్టారని చెప్పాలి. ట్రైలర్లో విజువల్స్ అదిరిపోయాయి. సినిమాలో కూడా అదే రేంజ్లో ఉంటాయని తెలుస్తుంది.

4) బాబీ డియోల్ : ఇతను ఎంత గొప్ప నటుడో ‘యానిమల్’ తో ఇండియా మొత్తం తెలిసింది. అయితే ‘యానిమల్’ కంటే ముందే ‘హరిహర వీరమల్లు’ కోసం బాబీ డియోల్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ కనిపించబోతున్నారు. ఈయన పాత్ర కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అంటున్నారు.

5) 2022 లో వచ్చిన ‘హీరో’ తర్వాత నిధి నుండి మరో సినిమా రాలేదు. ‘హరిహర వీరమల్లు’ లో ఆమె చేసిన పంచమి పాత్రని బాగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. భరతనాట్యం, గుర్రపు స్వారీలు కూడా ఈమె ప్రాక్టీస్ చేసిందట ఈ సినిమా కోసం. కచ్చితంగా ఈమె పాత్ర అందరినీ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

6) లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఆయన చివరి సినిమా అని తెలుస్తుంది. ఆయన నటన మరోసారి స్క్రీన్ పై చూసే అవకాశం ‘హరిహర వీరమల్లు’ తో లభించనుంది.

7) ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పవన్ అభిమానులకు కావాల్సిన గూజ్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉంటాయట. అలాగే క్లైమాక్స్ కూడా వావ్ ఫ్యాక్టర్ తో నిండి ఉంటుంది అని సమాచారం.

8) ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

9) మనోజ్ పరమహంస, జ్ఞాన సాగర్ వి.ఎస్..ల సినిమాటోగ్రఫీలో రూపొందిన విజువల్స్ అన్నీ టాప్ నాచ్ లో ఉంటాయట. కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని టాక్.

10) సచిన్ కేడెకర్, నాజర్, నర్గీస్ ఫక్రి, అనుపమ్ ఖేర్, మకరంద్ దేశ్ పాండే ..వంటి స్టార్స్ చేసిన రోల్స్ కూడా అలరిస్తాయని తెలుస్తుంది.

Pawan Kalyan: చాలా రోజులకు మాట్లాడిన పవన్‌.. వైరల్‌ కామెంట్స్‌ ఏమేం చేశాడో చదివేయండి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus