Pawan Kalyan: చాలా రోజులకు మాట్లాడిన పవన్‌.. వైరల్‌ కామెంట్స్‌ ఏమేం చేశాడో చదివేయండి!

స్టార్‌ హీరోగా ఓ లెవల్‌లో ఉన్న రోజుల్లోనే పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడూ తన సినిమాల కోసం ప్రెస్‌ మీట్‌లు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన కోసం ఎంతో చేసిన నిర్మాత ఎ.ఎం.రత్నం కోసం ఇలా వస్తున్నా అని పవన్‌ చెప్పారు కూడా. ఇక ఇంటర్వ్యూలో పవన్‌ చెబుతున్న విషయాలు, చేస్తున్న కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. వాటన్నింటినీ ఒక దగ్గర అందించే ప్రయత్నం ఇదీ.

Pawan Kalyan

* ఒక సినిమా విడుదలవుతుందంటే గుండెలపై బరువు దించినట్లుగా ఉంటోంది. ఎన్నికలకు ఏడాది ముందు చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల కారణంగా నా సినిమాలు ఆలస్యమవుతూ వచ్చాయి. ఇప్పుడు ఒక్కోటి పూర్తి చేస్తున్నాను.

* నేను ఆర్టిస్ట్‌గా కన్నా టెక్నీషియన్‌గా ఎక్కువగా ఆలోచిస్తా. నా మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉన్నప్పుడు నేను యాక్షన్‌ కొరియోగ్రఫీ చేయడానికి రెడీ అవుతా. అదే ‘హరి హర వీరమల్లు’లో చేశా.

* వైఎస్‌ఆర్‌సీపీ జనాలు చేస్తున్న బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఈ సినిమాకు నడవదు. తుపాకీ గురి పెట్టి ఎవరూ బలవంతంగా సినిమాలు చూపించరు. సినిమా చూడటం ప్రేక్షకుల ఛాయిస్‌. ప్రత్యర్థులు ఏం చేస్తారో చేయనీయండి.

* ‘హరి హర వీరమల్లు’ పార్ట్‌ 1కి వచ్చే డబ్బులు, నాకు టైమ్‌ బట్టి ‘పార్ట్‌ 2’ చేస్తాను. ప్రస్తుతం 20 శాతం సినిమా అయితే షూటింగ్‌ చేశాం.

* చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా ఫర్వాలేదు అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు, ఫిల్మ్‌ మేకింగ్‌ స్కూల్‌ తీసుకురావాల్సిన అవసరం ఉంది.

* ‘భీమ్లానాయక్‌’ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలు తగ్గించినప్పుడు నేను, నిర్మాత నష్టపోయాం. రూ.10 – రూ.15కి అప్పుడు నా సినిమాకు టికెట్లు అమ్మారు.

* సినిమా బాగుందంటే ఆనందపడతాను. బాగోలేకపోతే ఎక్కడ తప్పు జరిగిందో చూసుకుంటాను. సినిమా విడుదలైన తర్వాత ఒంటరిగానే ఉండటం అలవాటు అయిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఇలానే ఉంటున్నా.

* వరుస విజయాల తర్వాత ‘జానీ’ సినిమా చేస్తే అది ఆడలేదు. సినిమా విడుదలైన తర్వాత ఫైనాన్షియర్లు నా ఇంటికి వచ్చారు. అప్పుడు నా రెమ్యూనరేషన్‌ తిరిగి ఇచ్చేశాను. మరో రూ.15లక్షలు అప్పు మరీ ఇచ్చాను.

* ‘జానీ’ సినిమా నాకు రాజకీయాల్లో ఉపయోగపడింది. ఆ సినిమా స్ఫూర్తితోనే తొలిసారి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు బలంగా నిలబడ్డాను.

* నా లైఫ్ లో ఒక్క పార్టీకి మాత్రమే వెళ్లాను. అదే ‘భీమ్లా నాయక్’ టీమ్‌ పెట్టుకున్న పార్టీకి. ఆ సినిమాకి అంత తక్కువ టికెట్ ధరలు పెట్టినా బాగానే డబ్బులు వచ్చాయి. టీం పార్టీ ప్లాన్ చేసి పిలిస్తే వెళ్లాను.

కీలక నిర్ణయం తీసుకున్న యాంకర్‌ రష్మీ.. ఇకపై దానికి దూరంగా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus