ఉగాది పండుగ నుండి #itstartshere అంటూ ఆకర్షిస్తూ వస్తున్న వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం'(Isakapatnam). ‘తమడా మీడియా’ సంస్థపై రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సిరీస్ ను గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ లో భాగంగా.. జూలై 2 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు ‘ఇసకపట్నం’ సిరీస్ రూపొందినట్టు ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ చెప్పకనే చెప్పాయి. అయితే ఈ వీకెండ్..కి ‘ఇసకపట్నం’ని మిస్ కాకుండా చూడటానికి కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి :
ఐశ్వర్య రాజేశ్ : ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐశ్వర్య రాజేశ్ నుండి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఇందులో భారతి అనే విప్లవాత్మక భావాలు కలిగిన అమ్మాయిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ట్రైలర్లో ఆమె పాత్రని పరిచయం చేసిన తీరు బాగుంది. ‘తను నమ్మిన సిద్దంతాల కోసం తండ్రికే ఎదురెళ్ళాల్సిన పరిస్థితులు ఈమెకు ఎందుకు వచ్చాయి’ అనే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేసి.. సిరీస్ పై క్యూరియాసిటీ పెంచారు.
సముద్రఖని : ‘ఇసకపట్నం’ కి డాన్ లాంటి పాత్రని పోషించారు సముద్రఖని. ‘నాయకుడు’ సినిమాలో కమల్ హాసన్ రేంజ్ పాత్ర అని ఆయన ప్రమోషన్స్ లో చెప్పడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ట్రైలర్లో చాలా స్టైలిష్ గా, అలాగే పవర్ఫుల్ గా ఈ పాత్ర కనిపించింది. సిరీస్..పై క్యూరియాసిటీ పెంచింది.
నరేష్ అగస్త్య : కెరీర్ ప్రారంభం నుండి నరేష్ ఎంపిక చేసుకునే పాత్రలు, సెలక్ట్ చేసుకునే ప్రాజెక్టులు వైవిధ్యంగా ఉంటున్నాయి. ‘ఇసకపట్నం’ లో ఇతని పాత్రలో చాలా ఎమోషన్ దాగి ఉన్నట్టు.. ప్రతి విజువల్ చెబుతుంది.
సునీల్ : ఈ మధ్య కాలంలో సునీల్ ఎక్కువగా పరభాషా సినిమాల్లోనే నటిస్తున్నారు. అందులోనూ నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు. అయితే ‘ఇసకపట్నం’లో ఆయన ఫుల్ పాజిటివ్ రోల్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా అందరిలోనూ ఆసక్తిని పెంచే అంశంగా చెప్పుకోవాలి.
నిర్మాణ విలువలు: ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘ఇసకపట్నం’ సిరీస్‌ను ‘తమడా మీడియా’ సంస్థపై రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బొర్రా సంయుక్తంగా నిర్మించారు. వెబ్ సిరీస్ అయినప్పటికీ ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తోంది. సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా విజువల్స్ ఉన్నాయి. ఎక్కడా రాజీపడకుండా నిర్మాతలు ఎంతో ప్యాషనేట్‌గా ఖర్చుపెట్టినట్లు దీనిని బట్టి స్పష్టమవుతోంది.
గ్యారీ బి.హెచ్ డైరెక్షన్: నేటితరం ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా గ్యారీ బీహెచ్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్‌తో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ వంటి వాటిని పిక్చరైజ్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇవి మాత్రమే కాదు… ఈ సిరీస్లో ఇంకా చాలా మంది స్టార్స్ నటించారు. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ వంటి ప్రత్యేకతలు ఈ సిరీస్‌లో ఎన్నో ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో ఇంట్లో కూర్చుని వీక్షించేందుకు ‘ఇసకపట్నం’ వెబ్ సిరీస్ మూవీ లవర్స్ కి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి.