పేరుకే పాన్ ఇండియా స్టార్. కానీ మన ప్రభాస్ కి (Prabhas) సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన మొహమాటం చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. విదేశాల్లో కూడా ప్రభాస్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. కానీ వేరే రాష్ట్రం లేదా దేశం వెళ్లి సినిమా గురించి మాట్లాడాలి అంటే ప్రభాస్ కి వణుకు వచ్చేస్తూ ఉంటుంది. మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతాడో తెలీదు. ఒకవేళ మాట్లాడినా.. ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లు మాట్లాడేస్తూ ఉంటాడు.
అందుకే సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ కి కనుక ఈవెంట్ కి సంబంధించిన బ్యాచ్ వచ్చి మైక్ ఇస్తే అది పక్క వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. ‘బాహుబలి’ (Baahubali) నుండి ‘కల్కి..'(Kalki 2898 AD) వరకు ఇదే సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా ‘కల్కి..’ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్ళొచ్చాడు ప్రభాస్. అక్కడ ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ (Kamal Haasan) , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , దీపికా పదుకోనె (Deepika Padukone), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) .. సినిమా గురించి ప్రసంగించారు.
దానికంటే ముందుగా ప్రభాస్ కి మైక్ ఇస్తే పక్కన ఉన్న కమల్ హాసన్ కి ఇచ్చేయాలని చూశాడు. కమల్ కి కూడా మైక్ అందడంతో .. ఇటు వైపు ఉన్న దీపికా పదుకోనెకి ఇచ్చేయాలని చూశాడు. కానీ అప్పటికే దీపికాకి కూడా మైక్ అందడంతో.. అమాయకపు లుక్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
బాహుబలి నుండి తాను నటించిన ప్రతి సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మాట్లాడటానికి ఇబ్బంది పడతాడు కాబట్టే.. ఓ సందర్భంలో ‘తక్కువ మాట్లాడతాను.. ఎక్కువ సినిమాలు చేస్తాను’ అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు ప్రభాస్.
Introverts kashtalu be like .. same problem #Prabhas gaaru@PrabhasRaju @TrendsPrabhas #KALKI2898AD #KALKI2898ADOnJune27th #kalki289ad #Kalki pic.twitter.com/nt1hBlDc5s
— Phani Kumar (@phanikumar2809) June 21, 2024