Mirzapur 3 Trailer Review: మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. 2018 లో పెద్దగా చప్పుడు లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సిరీస్ ను ప్రేక్షకులు విపరీతంగా చూశారు. విపరీతమైన బెడ్ రూమ్ సీన్స్, బూతులు, వయొలెన్స్ తో నిండి ఉంటుంది ఈ సిరీస్. అయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ ను… తిడుతూనే చాలా మంది ప్రేక్షకులు వీక్షించారు. ఒరిజినల్ కంటే కూడా డబ్బింగ్ వెర్షన్స్ కి ఎక్కువ వ్యూయర్ షిప్ రావడం కూడా అప్పట్లో ఓ సంచలనంగా చెప్పుకోవాలి.

అందుకే వెంటనే ‘మీర్జాపూర్ సీజన్ 2 ‘ ని కూడా షూట్ చేసి రిలీజ్ చేశారు. అయితే మొదటి సీజన్ సక్సెస్ ఆయన రేంజ్లో.. రెండో సీజన్ సక్సెస్ కాలేదు అనే చెప్పాలి. అయినప్పటికీ మున్నా భయ్యా అనే పాత్ర వల్ల .. రెండో సీజన్ ని కూడా బాగానే చూశారు అని చెప్పాలి. ఇదే క్రమంలో ‘మీర్జాపూర్ సీజన్ 3 ‘ ని కూడా చిత్రీకరించారు.

జూలై 5 న సీజన్ 3 .. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. తాజాగా ట్రైలర్ ని కూడా వదిలారు. ఇది కూడా విపరీతమైన వయొలెన్స్, బూతుల..తో నిండి ఉంది. అయితే సీజన్ 2 లో మున్నా భయ్యా పాత్ర చనిపోయింది, అలాగే ఇందులో పెద్దగా గ్లామర్ కూడా లేకపోవడం అనేది టార్గెటెడ్ ఆడియన్స్ ని నిరాశపరిచే అంశంగా చెప్పుకోవాలి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus