Good Luck Sakhi Movie: కీర్తి సురేష్ మూవీ పై ఇప్పటికీ స్పష్టత రాలేదుగా..!

కరోనా కారణంగా లాక్ డౌన్ పడడం.. దాంతో చాలా సినిమాలు విడుదల కాకపోవడం, అటు తర్వాత థియేటర్లు తెరుచుకున్నా… మళ్ళీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడడం వంటివి జరిగాయి. ఇదిలా ఉండగా.. కరోనా టైంలోనే కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి ‘పెంగ్విన్’ కాగా మరొకటి ‘మిస్ ఇండియా’ కావడం విశేషం. ఈ రెండు సినిమాలకి ప్లాప్ టాక్ వచ్చినా.. మంచి వ్యూయర్ షిప్ రావడంతో ఆయా ఓటిటి సంస్థలు గట్టెక్కేశాయి.

అయితే కీర్తి సురేష్ సినిమాల పై ఉన్న నమ్మకం సన్నగిల్లిందనే చెప్పాలి. దాంతో ఆమె తర్వాతి సినిమాలను ఓటిటి రిలీజ్ చేయడానికి మేకర్స్ భయపడుతున్నారు. నిజానికి ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఓటిటిలోనే రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత నిర్మాతలు ఆ ఆలోచనని మార్చుకున్నారు. అయితే ఎంతటికీ ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిజానికి జూన్ 3న ఈ చిత్రం విడుదలవుతుంది అంటూ నిర్మాతలు ప్రకటించారు.

కానీ ఆ టైంకి థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో విడుదల వాయిదాపడింది. తర్వాత కూడా ఈ చిత్రం విడుదల పై నిర్మాత నోరు మెదపలేదు. అర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ చిత్రం నిర్మాతకి దిల్ రాజు సాయం చేశారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అంత పెద్ద నిర్మాత ఇన్వాల్వ్ అయినా ఈ చిత్రం ఇంకా విడుదల కాకపోవడం గమనార్హం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus