రేణు బర్త్ డే సెలబ్రేట్ చేసిన అకీరా, ఆధ్య!

Advertisement

నటిగా, దర్శకురాలిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణుదేశాయ్.. ‘బద్రి , జాని’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను నిర్మించి నిర్మాతగా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేసింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల సినీ పరిశ్రమకు దూరమైన ఆమె మళ్లీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 4న రేణు తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది.

ఈ సందర్భంగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఆమె విషెస్ చెప్పారు. రీసెంట్ గా పూణే నుండి హైదరాబాద్ కి వచ్చిన రేణుకి ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారితో కలిసి తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. రేణు ఇద్దరు పిల్లలు అకీరా, ఆధ్య దగ్గరుండి ఈ వేడుకలు జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అకీరాని చూసి మురిసిపోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

టాలీవుడ్ నెక్స్ట్ పవర్ స్టార్ అంటూ ఫోటోల కింద కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. భర్తతో విడిపోయిన తరువాత రేణు తన పిల్లలతో కలిసి పూణేలోనే ఉంది. పిల్లలంటే ప్రాణంగా చూసుకునే రేణు వారి ఇష్టాలకు వ్యతిరేకంగా ఏది చేయనని అంటోంది. ఇటీవల పవన్ తో కలిసి అకీరా, ఆధ్యలు తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది.

1

2

3

4

5

6

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus