Renu Desai: కాలికి గాయం అయ్యిందంటూ రేణు దేశాయ్ పోస్ట్.. జాగ్రత్తలు చెబుతున్న అభిమానులు!

ప్రముఖ సినీనటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇలా తిరిగి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

అలాగే తన (Renu Desai) పిల్లలకు సంబంధించిన విషయాలను ముఖ్యంగా అఖీరా నందన్ కు సంబంధించిన అన్ని విషయాలను ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. ఒకరోజు క్రితం ఈమె అకీరానందన్ వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ మరొక పోస్ట్ చేశారు.

రెండు రోజుల క్రితం తన కాలికి తీవ్రమైన గాయం తగిలిందని తెలిపారు. ఇలా గాయం కావడంతో తన కాలి మూడు వేళ్ళు చాలా దెబ్బతిన్నాయని ముఖ్యంగా మరొక వేలు చాలా చితికిపోయింది అంటూ ఈమె తనకు గాయం అయిన విషయాన్ని తెలియచేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇలా ఈమె కాలికి గాయమైనప్పటికీ అలాగే నడుచుకుంటూ బీచ్ లో ఎంజాయ్ చేశారు.

ఇలా కాలికి దెబ్బ తగిలినప్పటికీ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ సముద్రపు అలలు తనని తాకుతూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది చూసినటువంటి అభిమానులు ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus