RGV,Ariyana: అరియనా మీద ఒట్టేసి మరీ నిజం చెప్పిన వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. జిమ్ లో జరిగిన ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నాడు వర్మ. ఈ ఇంటర్వ్యూలో తనకు ఎవరితో రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు వర్మ. అలానే మరికొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ముందుగా అరియనా.. వర్మను పొగుడుతూ.. లాక్ డౌన్ కి ముందు మీతో చేసిన ఇంటర్వ్యూ వలనే నాకు రియాలిటీ షోలో ఛాన్స్ వచ్చిందంటూ వర్మకు థాన్స్క్ చెప్పింది.

దానికి వర్మ.. ‘నీలాంటి అందమైన అమ్మాయిని పొగిడాను అంతే కానీ.. నా పొగడ్తల వలనే నీకు రియాలిటీ షోలో ఛాన్స్ వచ్చిందంటే నమ్మనని’ అన్నారు. ఆ తరువాత అరియానా రియాలిటీ షో నుండి బయట వచ్చిన తరువాత చాలా మంది తన గురించి తప్పుగాఅనుకుంటున్నారని .. తనకు ఆర్జీవీతో సంబంధాలున్నాయని కామెంట్స్ చేస్తున్నట్లు వర్మతో చెప్పింది. దానికి వర్మ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మంచి స్నేహితులుగా ఉంటే కొంతమంది చూడలేరని..

అలాంటి వాళ్లే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారని.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ మధ్యకాలంలో వర్మ.. హీరోయిన్ అప్సర రాణితో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఈ విషయంపై ఆర్జీవీతో మాట్లాడుతూ.. ‘ఆమెతో రిలేషన్ లో ఉన్నారా..?’ అని ప్రశ్నించింది అరియనా. దానికి షాకైన వర్మ.. తనకు ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ లేదని.. ‘నీ మీద ఒట్టు’ అంటూ అరియానాకు బదులిచ్చారు.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus