Rithu Chowdary: దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు..రీతూ ఎమోషనల్ కామెంట్స్!

  • December 20, 2023 / 06:56 PM IST

జబర్దస్త్ కామెడీ ఇంకా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రీతు చౌదరి ఒకరు. ఈమె పలు బుల్లితెర సీరియల్స్ తో పాటు ఈ కార్యక్రమంలో కమెడియన్ గా నటించి సందడి చేశారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఇందులో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించారు. అంతేకాకుండా వీడియోలను మార్ఫింగ్ చేసి తనకే ట్యాగ్ చేస్తున్నారని ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా నాకు ట్యాగ్ చేసే వరకు వీడియోలను మార్ఫింగ్ చేశారు అనే విషయం నాకు తెలియదని అయితే ఈ విషయం జరిగి ఐదు నెలలవుతుందని బయటికి చెప్పాలా వద్దా అంటూ తాను ఎంతో ఆలోచించి ఈ విషయాలను బయటకు చెబుతున్నానని ఈమె తెలియజేశారు.

ఈ విషయంలో శ్రీకాంత్ అలాగే అమ్మ ,అన్న, విష్ణు ప్రియ అందరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారని ఈమె వెల్లడించారు. అలాగే ఇ వీడియోలను మార్ఫింగ్ చేయడంతో అందుకు సంబంధించినటువంటి లింక్స్ సైబర్ క్రైమ్ వాళ్లకు ఇచ్చానని అంతేకాకుండా తన ఫోటోలు వీడియోలపై చాలామంది దారుణమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారని రీతు ఈ సందర్భంగా వెల్లడించారు.

నేను ఏదైనా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తే కనుక బూతు కామెంట్లు చేస్తున్నారు. ఒకరోజు రాత్రికి వస్తావా? టుడేస్ నైట్ కి ఎంత తీసుకుంటావో సినిమా అవకాశాలు లేకే ఇలా చేస్తున్నావ్ కదా అంటూ చాలామంది నా గురించి కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ లింక్స్ అన్నింటిని కూడా తాను వారికి అప్పగించాను అంటూ ఈ సందర్భంగా (Rithu Chowdary) ఈమె షేర్ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus