జబర్దస్త్ షో ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా పాపులర్ అయిన వాళ్లలో రీతూ చౌదరి ఒకరు కాగా సోషల్ మీడియాలో రీతూ చౌదరికి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. కొన్నిరోజుల క్రితం రీతూ చౌదరి తండ్రి మృతి చెందగా కుటుంబానికి ప్రస్తుతం ఆమే అండగా నిలుస్తూ ఎలాంటి కష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త ఇంటిని నిర్మిస్తున్న రీతూ చౌదరి ఇంటీరియర్ డిజైనర్ చేతిలో మోసపోయానని వెల్లడించారు.
ఒక వ్యక్తి ఇంటీరియర్ వర్క్ ను అప్పగిస్తే 2 లక్షల రూపాయలు మోసం చేశారని ఆమె అన్నారు. మా కుటుంబానికి నాన్న దూరం కావడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రీతూ చౌదరి వెల్లడించారు. నాన్న లేకపోవడంతో కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చానని ఆమె అన్నారు. అయితే డబ్బులు తీసుకున్న వ్యక్తి నేను చెప్పిన విధంగా పని చేయడం లేదని రీతూ చౌదరి పేర్కొన్నారు.
పని రాకపోతే రాదని చెప్పవచ్చని అయితే ఆ వ్యక్తి మాత్రం సగంసగం పనులు చేస్తున్నాడని రీతూ చౌదరి కామెంట్లు చేశారు. అతడిని పనిలో నుంచి తీసేసి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని రీతూ చౌదరి పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఫోన్లకు కూడా సరిగ్గా స్పందించేవాడు కాదని రీతూ చౌదరి కామెంట్లు చేయడం గమనార్హం. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ.3 లక్షలు తిరిగి ఇచ్చాడని రీతూ చౌదరి అన్నారు.
ఇల్లు విషయంలో నేను ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె తెలిపారు. నేను ఆర్థికంగా మోసపోవడంతో పాటు తీవ్రమైన కుంగుబాటుకు గురయ్యానని రీతూ చౌదరి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మరో వ్యక్తికి పని అప్పగించానని నాకు ఎదురైన ఇబ్బంది ఎవరికీ ఎదురు కాకూడదని భావించి ఈ వీడియోను షేర్ చేస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు. (Rithu Chowdary) రీతూ చౌదరి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!