Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

నితిన్ (Nithiin) హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘ఛలో’ వంటి డీసెంట్ హిట్ తర్వాత ‘రాబిన్ హుడ్’ (Robinhood) అనే సినిమా వచ్చింది. ఉగాది కానుకగా మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలీల (Sreeleela) ఇందులో హీరోయిన్ గా నటించింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని.. ఈ చిత్రాన్ని నితిన్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించారు. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో కేమియో కూడా ఇచ్చారు. ఇన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ ‘రాబిన్ హుడ్’ ని జనాలు పట్టించుకోలేదు.

Robinhood Collections:

రాజేంద్రప్రసాద్- వెన్నెల కిషోర్..ల కామెడీ వర్కౌట్ అయినా మిగిలిన కంటెంట్ అంతా రొటీన్ గా ఉండటంతో జనాలు పెదవి విరిచారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది ఈ సినిమా. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.35 cr
సీడెడ్  0.70 cr
ఉత్తరాంధ్ర 0.60 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.45 cr
కృష్ణా 0.40 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 5.18 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.37 cr
 ఓవర్సీస్ 0.37 cr
టోటల్ వరల్డ్ వైడ్ 6.3 (షేర్)

‘రాబిన్ హుడ్’ (Robinhood) చిత్రానికి రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్లో కేవలం రూ.6.3 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.22.2 కోట్ల దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలిపోయింది. గ్రాస్ పరంగా కేవలం రూ.12.07 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus