Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

సీనియర్‌ నటి రోజా కొన్ని రోజుల క్రితం సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో రెండేళ్ల క్రితం వరకు బిజీగా ఉన్న ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో లేకపోవడంతో ఆమె తిరిగి సినిమాల్లోకి వచ్చారు. తొలుతగా ‘చెంబురతి’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన తమిళ సినిమాలో రీఎంట్రీ కూడా ఇచ్చారామె. ఆ సినిమా ‘అన్బే డయానా’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ బయటకు వచ్చింది.

Roja

పరి ఎల్వలాన్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో రోజా, రమన్య రంగనాథన్‌, నిఖిల శంకర్‌ తదితరులు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాను త్వరలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఓ పెళ్లి చుట్టూ తిరుగుతుంది అని చెబుతున్న కథను పెరంబూరు నేపథ్యంలో తెరకెక్కించారు దర్శకుడు. సినిమాలో ఆ ప్రాంతం కీలకంగా ఉంటుంది అని చెబుతున్నారు.

ఇందులో తల్లి పాత్రలో రోజా నటిస్తున్నారు. అగ్రెసివ్‌ లుక్‌లో రోజా పాత్ర ఆకట్టుకునేలా ఉంది. ఆమెకు ఉన్న ఫైర్‌ బ్రాండ్‌ అనే పేరుకు తగ్గట్టుగా ఆ పాత్రను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఆమె ఒక ఆకర్షణ అయితే.. మరో ఆకర్షణ సినిమా నేపథ్య ప్రాంతం. ఎందుకంటే ఆ ప్రాంతం నుండే సీఎం విజయ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఆ ప్రాంతం ఇప్పుడు తమిళనాట బాగా ఫేమస్‌. ఇదే విషయం దర్శకుడు దగ్గర ప్రస్తావిస్తే.. అనుకోకుండా అలా జరిగింది అంటున్నారు.

అయితే, విజయ్‌ రాజకీయ ప్రవేశం ప్రకటన వచ్చేదానికి ముందే తమ సినిమా షూటింగ్‌ అయిపోయిందని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ అంశం తమ సినిమా ప్రచారానికి పనికొస్తోందని చెప్పారు. అన్నట్లు ఈ సినిమాతోపాటు మరో తమిళ సినిమాలోనూ రోజా నటిస్తున్నారు. అదే ‘లెనిన్‌ పాండ్యన్‌’. ఈ సినిమా పోస్టర్లు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి.

 DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus