ఆ నాటకాలు నాకు నచ్చలేదన్న రోజా.. ఏమైందంటే?

  • January 3, 2023 / 05:54 PM IST

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు హాజరవుతున్న ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేయడంతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ సీక్రెట్లను ఈ షో ద్వారా రివీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ నటి రోజా అన్ స్టాపబుల్ షో సీజన్2 కు హాజరవుతారని కొంతకాలం క్రితం ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదనే సంగతి తెలిసిందే. బాలయ్య, రోజా కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.

బాలయ్య, రోజా వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే అన్ స్టాపబుల్ షోకు తనకు ఆహ్వానం వచ్చిందని ఈ షోలో పాల్గొనే ఆలోచన మాత్రం తనకు లేదని రోజా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. రోజా మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్ స్టాపబుల్ షో ద్వారా ఆ వెన్నుపోటులో తప్పు లేదనే విధంగా చూపించారని రోజా కామెంట్లు చేశారు.

కూతురి భవిష్యత్తు కోసం బాలయ్య చంద్రబాబుతో కలిసి నాటకాలు ఆడారని ఆ నాటకాలు నాకు నచ్చలేదని రోజా చెప్పుకొచ్చారు. చంద్రబాబు తప్పు చేయలేదని బాలయ్య ప్రూవ్ చేయాలనుకోవడం దారుణం అని రోజా కామెంట్లు చేశారు. అన్ స్టాపబుల్ షోకు వెళితే పార్టీకి తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీకి నష్టం కలుగుతుందని

ఈ రీజన్ వల్లే ఆ షోకు నేను వెళ్లాలని భావించడం లేదని రోజా వెల్లడించారు. రోజా చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజా చేసిన కామెంట్లను కొంతమంది సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus