RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజయ్యేది అప్పుడేనా..?

  • June 17, 2021 / 06:11 PM IST

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు దేశంలోని సినీ అభిమానులంతా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీన ఈ సినిమా రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా పడిందని వార్తలు వినిపించాయి.

అయితే రాజమౌళి మాత్రం 2022 జనవరి 26వ తేదీన రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల కథతో ఈ సినిమా తెరకెక్కడంతో జనవరి 26వ తేదీ సరైన తేదీ అని ఆర్ఆర్ఆర్ నిర్మాత కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు సినిమాలో రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పూర్తి కాగా పది భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా భారతీయ సినిమాల్లోనే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డును సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాదికి వాయిదా పడిందని వస్తున్న వార్తల వల్ల చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus