RRR Movie: ట్వీట్లకు జక్కన్న టీమ్‌ ఇస్తున్న రిప్లైలు చూశారా?

  • April 3, 2021 / 04:48 PM IST

సోషల్‌ మీడియాలో ‘ఏంటి మావా.. సంగతులు’ అని అడిగితే మీకు ఆన్సర్‌ ఇచ్చే ఫ్రెండ్‌ ఉన్నాడా? చాలామంది ఉండే ఉంటారు. అలా ఫ్రెండ్‌ తరహాలో రిప్లైలు ఇచ్చే సినిమా టీమ్‌లు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. అయితే అది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కంటే ముందు అని చెప్పొచ్చు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ రీసెంట్ ట్విటర్‌ రిప్లైలు చూస్తే మీకూ ఇదే అనిపిస్తుంది. అన్ని సినిమాలు లాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి కూడా సోషల్‌ మీడియా టీమ్‌ ఉంది. అయితే ఆ అడ్మిన్‌ ఎవరో కానీ మహా చిలిపి. కావాలంటే ఈ రిప్లైలు చూడండి.

కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ ఆలస్యమైంది. ఈలోగా అప్‌డేట్స్‌ ఇవ్వండి అంటూ అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియాలో రోజూ అడిగేవారు. సినిమా షూట్‌ మొదలయ్యాక… మీకు అప్‌డేట్స్‌ మామూలుగా ఉండవు అంటూ వరుసగా ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సంతృప్తి చెందని అభిమానులు ఇంకా అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మధ్యలో ఒకరిద్దరు అభిమానులు కొంటె కామెంట్లు కూడా చేశారు. అవి ఎంత ఫన్నీగా ఉన్నాయో… వాటికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఇస్తున్న రిప్లైలు అంతే ఫన్నీగా ఉన్నాయి.

ఒక అభిమానికి ‘అలాంటి పనులు చేసి భయపెట్టకు’ అని రిప్లై ఇచ్చిన టీమ్‌, మరొకరికి ‘పెట్టాము అయ్యా’ అంటూ సమాధానమిచ్చారు. ‘హేయ్‌ మళ్లీ…’ అంటూ ‘దూకుడు’లో మహేష్‌ ఎమోజీ వాడుకుంటే, మరో రిప్లైలో మీమ్‌ స్టార్‌ బ్రహ్మానందం ఫొటో వాడుకున్నారు. ఇలా మీమ్స్‌, రిప్లైస్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సోషల్‌ టీమ్‌ భలే సందడి చేస్తోంది. కావాలంటే మీరూ కొన్ని రిప్లైలు దిగువ చూసేయండి.

1

2

3

4

5

6

7

 

8

9

10

11

12

13

14

15

16

17

18

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus