Vishwambhara: విశ్వంభరలో అసలు ట్విస్ట్ ఇదే.. ఆ పాత్ర సినిమాకు హైలెట్ కానుందా?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విశ్వంభర (Vishwambhara)  సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డైరెక్టర్ వశిష్ట (Vassishtha) సరైన ప్లానింగ్ తో అడుగులు వేస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తారని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే త్రిష (Trisha) కూడా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

హీరోతో పాటు హీరోయిన్ కూడా డ్యూయల్ రోల్ లో నటిస్తే ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, త్రిష పాత్రలు క్లాస్ గా ఉండటంతో పాటు మాస్ గా కూడా ఉంటాయని సమాచారం అందుతోంది. చిరంజీవి, త్రిష మధ్య కెమిస్ట్రీ కూడా అదుర్స్ అనేలా ఉంటుందని విశ్వంభర సినిమా చిరు కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చిరంజీవి కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అభిమానులకు దగ్గరవుతున్నారు.

మాస్, క్లాస్ ప్రేక్షకులను మెప్పించే కథలకు చిరంజీవి ఓటేస్తుండటం గమనార్హం. యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్న చిరంజీవి సినిమాలతో ఆశించిన ఫలితాలను అందుకుంటున్నారు. చిరంజీవి పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. చిరంజీవి యంగ్ హీరోల సినిమాల ఈవెంట్లకు హాజరవుతూ ఆయా హీరోలు సక్సెస్ కావడానికి తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus