తెలుగు నేర్చుకొంటోన్న మలయాళ భామ!

  • August 16, 2016 / 11:21 AM IST

మలయాళంలో ‘ప్రేమమ్’ అనే సినిమాలో మలార్ గా యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన భామ సాయి పల్లవి. ఈ అమ్మడు నటనకు తెలుగులో కూడా చాలా మండి ఫ్యాన్స్ అయిపోయారు. హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా సాయి పల్లవిని చాలా ఇష్టపడుతున్నారు. తెలుగులో కూడా ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో అమ్మడుకి హీరోయిన్ అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె బాష కూడా అలానే ఉండాలని దీనికోసం పక్కా తెలంగాణ బాష నేర్చుకుంటోంది. ఈ విషయం కాస్త కష్టమైనదైనా.. శేఖర్ కమ్ముల తనకు సహాయం చేస్తానని చెప్పాడట. దీంతో అమ్మడు తెలుగు నేర్చుకోవడానికి సిద్ధమైపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus