తన ఫేవరేట్ హీరోతో నటించనున్న సాయి పల్లవి

  • December 21, 2017 / 01:28 PM IST

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మలయాళంలో తొలి సినిమా ప్రేమమ్ తో సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో ఫిదాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయి తో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇప్పుడు తమిళ ప్రజల మనసు దోచుకోవడానికి సిద్ధమవుతోంది. మణిరత్నం ‘కాట్రు వెలియిడై ‘ సినిమాతో కోలీవుడ్‌ ఆరంగేట్రం చేసే అవకాశం వచ్చినా చివర్లో చేజారింది. తరువాత విక్రమ్ ‘స్కెచ్’ మూవీలోనూ అవకాశం వచ్చినట్టే వచ్చిపోయింది. ఇప్పుడు మాత్రం వదులుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఛాన్స్ తన అభిమాన హీరో సూర్య సరసన నటించడం. సాయిపల్లవి హీరోయిన్ గా మారకముందే సూర్యను కలవాలని, అతడితో కనీసం ఒక సెల్ఫీ దిగినా చాలని అనుకునేది. హీరోయిన్ అయిన తర్వాత సూర్య సరసన నటించే అవకాశం కోసం ఎదురుచూసింది.

ఇప్పుడు ఆ టైమ్ వచ్చింది. అందుకే కథ చెప్పకుండా ఒకే చెప్పింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య చేయనున్న ఈ మూవీ లో హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నట్లు డ్రీమ్ వారియర్స్ నిర్మాణ సంస్థ ఈరోజు ప్రకటన చేసింది. దీంతో సాయి పల్లవి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కోలీవుడ్ లో సూర్య, సెల్వరాఘవన్ ది క్రేజీ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అది ఇన్నాళ్లకు సాధ్యమైంది. కెరీర్ లో తన 36వ సినిమాతో అటు సెల్వ రాఘవన్ కు, ఇటు సాయిపల్లవికి ఒకేసారి ఛాన్స్ ఇచ్చాడు సూర్య. ప్రస్తుతం సాయి పల్లవి విజయ్ దర్శకత్వంలో కరు చిత్రం చేస్తోంది. ఈ కథ మొత్తం అబార్షన్ల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో సాయిపల్లవి నాలుగేళ్ల పాపకి తల్లిగా నటించనుంది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus