పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి..!

ప్రస్తుతం అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇది పూర్తయిన వెంటనే మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ చెయ్యబోతున్నారు చిరు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ లో చెల్లెలి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇందుకోసం దర్శకనిర్మాతలు సాయి పల్లవిని మరియు కీర్తి సురేష్ ను అనుకున్నారట.

అయితే చివరికి కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సాయి పల్లవి అభిమానులు అలాగే కొంతమంది మెగా ఫ్యామిలీ అభిమానులు హర్ట్ అయినట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ సినిమా మిస్ అయినప్పటికీ… పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట మన రౌడీ బేబీ. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్’ సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ బలంగా వినిపిస్తోంది.ఒకవేళ అది నిజమే అయితే ఈమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని చెప్పాలి. ప్రస్తుతం ఈమె నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ అలాగే రానా ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus