వచ్చే ఏడాది రానున్న సాయి పల్లవి సినిమాలు

Advertisement

‘ప్రేమమ్(మలయాళం)’ సినిమా ద్వారా సాయి పల్లవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన మలయాళీగా నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో ఫిదా మూవీ చేసింది. ఇందులో అచ్చమైన తెలంగాణ అమ్మాయి భానుమతిలా నటించి అందరి మనసులు గెలుచుకుంది. ఫిదా విజయంతో ఆమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. రీసెంట్ గా మిడిల్ క్లాస్ అబ్బాయి లోను నాని కి జోడిగా చలాకీగా నటించి టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఈ సంవత్సరమే కాదు. వచ్చే ఏడాది కూడా ఆమె పేరుని యువత జపించనున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో తెలుగు, తమిళం కలిపి నాలుగు సినిమాలున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ లవ్ స్టోరీలో శర్వానంద్ సరసన నటించనుంది.

ఇక తమిళంలోను తన మార్కు నటనతో ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. విజయ్ దర్శకత్వంలో కరు చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంటర్ కాబోతోంది. ఇది తెలుగులో కణం గా రానుంది. ఇందులో నాలుగేళ్ల పాప‌కి త‌ల్లిగా సాయిప‌ల్ల‌వి నటించింది. నాగ శౌర్య హీరోగా చేసిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఈ చిత్రంతో తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకోనుంది. అలాగే సూర్యతో చేసే సినిమాలోను ఈ భామ డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించనుందట. సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక ధనుష్ మారి సీక్వెల్ లో కూడా అఫర్ కొట్టేసింది. ఆ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. సో వచ్చే ఏడాది సాయి పల్లవి దక్షిణాది టాప్ హీరోయిన్స్ జాబితాలో స్థానం సంపాదించుకోవడం గ్యారంటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus