నిన్ననే విజయ్ నటించిన ‘లియో’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘లియో’ మొదటి రోజే రూ.140 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. నాన్ రాజమౌళి సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా అని అంతా భావిస్తున్నారు. విజయ్ తెలుగులో, ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. గ్రాండ్ రిలీజ్ కావడంతో ఈ ఫీట్ ను సాధించడం జరిగింది.
విజయ్ కెరీర్లో కూడా మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన మూవీ ఇదే. 2023 లో కూడా మొదటి రోజు ఇంత భారీగా వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే.అయితే దీనికి ముందు ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. దానిని వెనక్కి నెట్టి.. ‘లియో’ ముందు వరుసలో చేరింది.
అయితే ‘ఆదిపురుష్’ నెగిటివ్ టాక్ తోనే ఈ ఫీట్ ను సాధించడం జరిగింది. ఇది కూడా మామూలు విషయం కాదు. ప్రభాస్ సినిమా కనుక హిట్ టాక్ ను సంపాదించుకుంటే.. కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమనే చెప్పాలి. ఇప్పుడు అందరి చూపు ‘సలార్’ పై ఉంది. బాహుబలి హీరోతో కె.జి.ఎఫ్ దర్శకుడైన ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ ఇది.
కాబట్టి మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా రూ.150 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే రూ.200 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు అనే చెప్పాలి. అప్పుడు మళ్ళీ 2023 లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ప్రభాస్ ‘సలార్’ (Salaar)పేరు ముందుకొస్తుంది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!