Salaar: సలార్ మూవీలో ఆ సీన్లు నెక్స్ట్ లెవెల్.. ఫ్యాన్స్ కు సందేహాలు వద్దంటూ?

  • August 7, 2023 / 07:45 AM IST

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉండగా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో సలార్ ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ ఇంటర్వెల్ సీన్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కాళీమాత సాక్షిగా అల్లకల్లోలం సృష్టించేలా ఈ సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ ఉంటుందని ప్రేక్షకుల ఊహలకు అందని సీన్లతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ కు ఏ మాత్రం టెన్షన్ అక్కర్లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మైండ్ బ్లోయింగ్ సీన్లతో ప్రశాంత్ నీల్ మ్యాజిక్ చేస్తారని తెలుస్తోంది. ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబో సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం. కాళీమాత విగ్రహం ముందు ప్రభాస్ వేటాడుతుంటే మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ పార్ట్1 షాకింగ్ ట్విస్ట్ తో ముగియనుందని తెలుస్తోంది. బాహుబలి1, బాహుబలి2 సినిమాలలా సలార్1, సలార్2 సినిమాలు సైతం ఒక సినిమాను మించి మరొకటి ఉండనున్నాయని తెలుస్తోంది.

ప్రభాస్ క్రేజ్ ఈ సినిమాలకు వరమవుతోందని సలార్ మూవీ బిజినెస్ విషయంలో చరిత్ర సృష్టిస్తోందని తెలుస్తోంది. సలార్ టైటిల్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా ప్రభాస్ రోల్ ఉండనుందని తెలుస్తోంది. సలార్ సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉండనుందని ఈ సినిమా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచే అవకాశం ఏ మాత్రం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో శృతి హాసన్ రోల్ కు కూడా భారీ స్థాయిలో ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. శృతి హాసన్ ఈ సినిమాలో అభినయ ప్రధాన పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. సలార్ మూవీ సెప్టెంబర్ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సలార్2 మూవీ 2024లో థియేటర్లలో విడుదల కానుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus