ఫిట్‌నెస్ విషయంలో బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్‌ను కొట్టేవారే లేరు. 60 ఏళ్ల వయసొచ్చినా.. ఇప్పటికీ జిమ్‌కి వెళ్తూ, డైట్ మెయింటైన్ చేస్తూ ఫిట్‌గా ఉంటున్నాడు. అందుకే కండల వీరుడు అనే పిలుస్తారు ఆయన అభిమానులు. అలాంటి కండల వీరుడికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో చూస్తే సల్మాన్ ఖాన్ నీరసంగా మారిపోయాడు. ఒంటిపై చొక్కా లూజ్‌గా ఉంది. తలపై ఓ పాత టోపీ పెట్టుకున్నాడు. కళ్లు లోపలకు వెళ్లిపోయాయి. మొత్తంగా వీక్‌గా కనిపిస్తున్నాడు.
ఆ ఫొటో ఇలా సోషల్ మీడియాలో బయటకు వచ్చిందో లేదో.. వైరల్ అయిపోయింది. సల్మాన్ ఖాన్‌కి ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల ముంబయిలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో సల్మాన్ పాల్గొన్నాడు. లబ్ది దారులకు కొత్త ఇళ్ల తాళాలు అందజేశాడు. ఆ ఈవెంట్ ఫొటోలు, వీడియోల్లోనే సల్మాన్ అలా కనిపించాడు. వెంటనే సల్మాన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు అనే వార్తలు గుప్పుమన్నాయి. భాయ్‌కు ఏమైంది అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
అయితే, ఈ కామెంట్లు ఆ నోటా ఈ నోటా పడి.. సల్మాన్ వరకు వెళ్లినట్లున్నాయి. రీసెంట్‌గా జరిగిన మరో కార్యక్రమంలో సల్మాన్ దగ్గర ఈ మాట ప్రస్తావిస్తే.. ‘మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది’ అంటూ కొన్ని ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు సల్మాన్. ఆ ఫొటోల్లో చూస్తే నార్మల్‌గానే కనిపించాడు. అందులోనూ వైరల్ అయిన ఫొటోల్లోని డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అదే లుక్‌లో ఉన్నాడు. ఈ తరహాలో తన హెల్త్‌పై సల్మాన్ ఇలా క్లారిటీ ఇచ్చాడన్నమాట. ఈ లెక్కన బయటకు వచ్చిన ఆ ఫొటోలు ఒరిజినల్ కావని చెప్పాలి.