Samantha: హాలిడే ట్రిప్ లో హఠాత్తుగా కిందపడిపోయిన సమంత!

  • October 20, 2021 / 08:48 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ఇటీవల తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. అయితే ఆమె విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఎప్పటిలానే సంతోషంగా కనిపిస్తుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఇక మొదట సోషల్ మీడియాలో కొన్ని కొటేషన్స్ వదులుతూ ఇంకా బలంగానే ఉన్నాను అంటూ చెప్పకనే చెప్పింది. అయితే తన పర్సనల్ లైఫ్ విషయాలను సినిమా కెరీర్ పై పడకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

ఎప్పటిలానే తన సన్నిహితులతో కూడా ఆమె ప్రత్యేకంగా హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల డెహ్రాడూన్ కు వెళ్లిన సమంత అక్కడ ట‌గ్ ఆఫ్ వార్ గేమ్ ఆడుతూ ఎంతో సరదాగా కనిపించింది. ఆ గేమ్ లో సమంత హఠాత్తుగా కింద కూడా పడిపోయింది. సమంతకు సంబంధించిన గేమ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఎక్కువగా శిల్పా రెడ్డి అనే తన క్లోజ్ ఫ్రెండ్ తో ఉంటుంది అని అందరికీ తెలిసిందే.

ఆమె స్నేహితులుగా ఉన్నవారు కూడా సమంతతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. డెహ్రాడూన్ వెళ్లిన సమంత కొన్ని రోజులు అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటోంది. ఇక మరికొన్ని రోజుల్లో సరి కొత్త ప్రాజెక్టులను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని సమంత ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus