Samantha: సమంత గుట్టు రట్టు చేసిన వీడియో ఇదే!

Advertisement

అక్కినేని కోడలు, ప్రముఖ నటి సమంత పెళ్లి తరువాత పాత్రల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మేన్ సీజన్ 2తో సమంత పాన్ ఇండియా నటిగా గుర్తింపును సంపాదించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటే సమంత మాత్రం ఫ్యామిలీ మేన్ సీజన్ 2లో డీ గ్లామర్ రోల్ తో సైతం ప్రశంసలు అందుకున్నారు.

అయితే రాజీ పాత్రను ఎలా చేయగలిగావని సమంతకు ప్రశ్నలు వ్యక్తం కాగా తాజా వీడియోతో సమంత ఆ పశ్నలకు సమాధానమిచ్చారు. ఫ్యామిలీ మేన్ సీజన్2 షూటింగ్ సమయంలో కేరవ్యాన్ లో తను చేసిన అల్లరి పనుల గురించి సమంత చెప్పుకొచ్చారు. కేరవ్యాన్ లో పిచ్చిపిచ్చిగా పాడుతూ సమంత గెంతులేయడం గమనార్హం. రాజీ పాత్రను ఎలా పోషించావని అడిగే వాళ్లకు ఇదే సమాధానమని సమంత చెప్పుకొచ్చారు. షూటింగ్ గ్యాప్ లో తాను ఈ విధంగా ఎంజాయ్ చేశామని అయితే వీడియోలో తన గొంతును వినవద్దని బ్యాడ్ సింగర్ నని ఆమె చెప్పుకొచ్చారు.

ఎవరో ఏదో అన్నారని మనం ఆగమని సమంత కామెంట్లు చేశారు. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు. సమంత నటిస్తున్న శాకుంతలం షూటింగ్ 50 శాతం పూర్తి కాగా మిగిలిన 50 శాతం పూర్తి కావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus