Samantha: విడాకుల ఎఫెక్ట్.. నిర్మాతలకు సమంత షరతులు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత శాకుంతలం సినిమా తర్వాత మరో రెండు తెలుగు సినిమాలలో నటిస్తున్నట్టు దసరా పండుగ రోజున అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలో ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే విడాకుల ప్రకటన నేపథ్యంలో సమంత నిర్మాతలకు షరతులు పెడుతున్నారని తెలుస్తోంది. చెన్నై లేదా చెన్నైకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో షూటింగ్ లను పూర్తి చేయాలని సమంత కోరుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో షూటింగ్ ను సమంత ఏ మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

ఒకవేళ దర్శకనిర్మాతలు హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ జరపాలని భావిస్తే మాత్రం ఇండోర్ లో మాత్రమే షూటింగ్ జరపాలని ఔట్ డోర్ లో జరపవద్దని సమంత సూచిస్తున్నారు. సమంత ఈ షరతులకు ఒప్పుకున్న నిర్మాతల నిర్మాణంలో తెరకెక్కే సినిమాలలో మాత్రమే నటించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. సమంత షరతుల వల్ల నిర్మాతలు కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఒక సినిమాకు, శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై ఒక సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాల ఫలితాలపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు సమంతకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా సమంత కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus